: ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అంబాసిడర్ గా సైఫ్ అలీఖాన్


బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) అంబాసిడర్ గా నియమితుడయ్యాడు. దీని తరపున శిక్షణ పొందే క్రీడాకారులకు విరాళాల రూపంలో నిధులను సేకరించడం, ఓజీక్యూ గురించి, వారి ప్రణాళిక గురించి ప్రచారం చేయడం సైఫ్ పని. ఒలింపిక్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించే దిశగా భారత వర్ధమాన క్రీడాకారులకు ఆర్థిక సాయం, శిక్షణ అందించే దిశగా ప్రముఖ క్రీడాకారులు గీత్ సేథీ, ప్రకాశ్ పదుకొనే ఈ ఎన్జీవో (స్వచ్ఛంద సంస్థ)ను స్థాపించారు. ఈ సందర్భంగా తన వంతు సాయంగా సైఫ్ రూ.20 లక్షలు సంస్థకు ప్రకటించాడు. ప్రతి ఏడాది అంటే 2016 రియో ఒలింపిక్స్ వరకు ఈ సహాయం అందుతుందని చెప్పాడు. అనంతరం సైఫ్ మాట్లాడుతూ, స్వతహాగా క్రీడలను ఇష్టపడే తనకు ఓజీక్యూ అంబాసిడర్ గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఒలింపిక్ కీర్తిని పెంచేందుకు భారత అథ్లెట్లకు ఓజీక్యూ మద్దతుగా నిలవడం అద్భుతమన్నాడు.

  • Loading...

More Telugu News