: డోంట్ వర్రీ... రెండింటినీ మేనేజ్ చేస్తా: గంగూలీ


క్రికెట్ నుంచి రిటైన ఆటగాళ్ళు వ్యాఖ్యాతలుగానో, శిక్షకులుగానో కొత్త అవతారమెత్తడం తెలిసిందే. గంగూలీ కూడా అదే బాటలో నడిచాడు. క్రికెట్ కామెంటేటర్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్ టూర్లోనూ దాదా తన మార్కు వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నాడు. తాజాగా వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు కూడా కామెంటరీ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సాకర్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ లీగ్ లో అట్లెటికో డి కోల్ కతా జట్టుకు గంగూలీ సహ యజమాని. విండీస్ తో సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండింటికీ గంగూలీ న్యాయం చేయగలడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై గంగూలీ స్పందిస్తూ, రెండు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, బాధ పడాల్సిన పనేలేదని, రెండింటినీ మేనేజ్ చేస్తానని ధీమాగా చెప్పాడు. ఫుట్ బాల్ ను అమితంగా ఇష్టపడే ఈ ప్రిన్స్ ఆఫ్ కోల్ కతా ఐఎస్ఎల్ ఓ నవశకానికి నాంది అని అభివర్ణించాడు. ఈ లీగ్ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపాడు.

  • Loading...

More Telugu News