: అమ్మపై అభిమానం ఉంటే ప్రశాంతంగా ఉండండి: తమిళనాడు సీఎం
జయలలితకు కర్ణాటక హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఏఐఏడీఎంకే అభిమానులు, పార్టీ కార్యకర్తలు పలువురు తీవ్ర నిరాశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్పందించారు. అమ్మపై (జయ) ప్రేమ, అభిమానం ఉంటే శాంతంగా ఉండాలని మద్దతుదారులను కోరారు. ఎలాంటి దాడులు చేయవద్దని, నిరసన తెలపవద్దని అన్నారు. ప్రశాంతంగా ఉండటం ఒక్కటే జయ పట్ల తమ ప్రేమను తెలుపుతుందన్నారు.