: జయకు బెయిల్ లభించకపోవడంపై ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు: సుబ్రహ్మణ్యస్వామి
పురచ్చితలైవిగా తమిళనాట మన్ననలు అందుకుంటున్న జయలలితను కటకటాల వెనక్కి వెళ్లేలా చేసిన వ్యక్తి బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి. జయ అక్రమంగా కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారంటూ డీఎంకే తో బాటు 1996లో స్వామి ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి ఇన్నేళ్లపాటు కొనసాగిన కేసులో చివరకు జయ దోషిగా తేలారు. బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు ఈ రోజు తిరస్కరించింది. దీనిపై సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. "జయకు బెయిల్ రాకపోవడంలో ఆశ్యర్చపడాల్సిందేమీ లేదు. బెయిల్ రాదని నేను ముందే ఊహించా" అన్నారు.