: హత్యకోసం రూ. కోటి సుపారీ ఇచ్చిన భూతం సోదరులు
కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లి కాల్పుల కేసులో మిస్టరీ వీడింది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు మారయ్య, పగిడి మారయ్యలను కాల్చిచంపిన ఘటనలో పాల్గొన్న ముగ్గురు నిందితులు, నలుగురు కిరాయి హంతకులను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో భూతం శ్రీనివాసరావు, భూతం గోవిందులే ప్రధాన నిందితులని పోలీసులు తేల్చారు. దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. కోటి రూపాయలు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో హత్య చేయించారని పోలీసులు వెల్లడించారు.