: తెలంగాణలోని పరిశ్రమలకు వారానికి రెండు రోజులపాటు కరెంట్ కట్


తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. విద్యుత్ కోతలతో ఇప్పటికే రాష్ట్రం అల్లాడుతోంది. ఈ క్రమంలో, పారిశ్రామిక ప్రాంతాల్లో వారానికి రెండు రోజులపాటు పవర్ హాలిడే విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రేపటి నుంచే అమల్లోకి వస్తుందని ట్రాన్స్ కో ఏఈడీ అంబేద్కర్ ప్రకటించారు. దీంతో, హైదరాబాదులోని ఐడీఏ బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో సోమ, మంగళవారాల్లో విద్యుత్ కోత ఉంటుంది. అలాగే... పాశమైలారం, పటాన్ చెరు పారిశ్రామికవాడల్లో బుధ, గురు వారాల్లో కోతలు ఉంటాయి.

  • Loading...

More Telugu News