: నేనున్నంతవరకూ మహారాష్ట్రను ఎవరూ విడదీయలేరు: మోడీ


మహారాష్ట్రను విభజించి ముంబయిను వేరుచేయాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ తోసిపుచ్చారు. ఈ మేరకు గిరిజన ధూలే జిల్లా ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ, "పదేళ్ల నుంచి పత్తి, ఉల్లిపాయలపై కాంగ్రెస్ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రను విభజిస్తారని మరో అబద్దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ దేశంలో పుట్టిన వారెవరైనా శివాజీ పుట్టిన స్థలాన్ని విభజించాలనుకుంటారా?" అని ప్రశ్నించారు. తాను ఢిల్లీలో అధికారంలో ఉన్నంతకాలం ప్రపంచంలోని ఏ శక్తీ మహారాష్ట్రను వీడదీయలేదని ఈ సందర్భంగా చెబుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. అంతేగాక మహారాష్ట్ర నుంచి ముంబయిని వేరుచేయలేరని కూడా ఘంటాపథంగా చెప్పారు.

  • Loading...

More Telugu News