: వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్


కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని వెంకయ్య తెలపడంతో కేసీఆర్ ఈ విధంగా స్పందించారు. హైదరాబాదులో జరుగుతున్న ప్రపంచ మేయర్ల సదస్సులో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఓ చారిత్రక నగరమని ఆయన అన్నారు. సదస్సుకు హాజరైన వారందరికీ స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. తెలంగాణలో పట్టణ జనాభా 40 శాతం దాటుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News