: కేసీఆర్ ను ఢీకొనేందుకు సిద్ధమవుతున్న నారా లోకేష్!


తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆ పార్టీ యువనేత నారా లోకేష్ అన్నారు. దీనికోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఆయన సిద్ధమవుతున్నారు. తెలంగాణలో అన్ని సమస్యలకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను, అసత్య ఆరోపణలను ఈ పర్యటనలో లోకేష్ ఎండగడతారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కేసీఆర్ నిజస్వరూపం బయటపెట్టేందుకు ఈ పర్యటనను లోకేష్ ఉపయోగించుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబుతో పోటీపడలేకే కేసీఆర్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని... తెలంగాణ సమస్యలన్నింటికీ కేసీఆర్ పాలనే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ పర్యటన విజయవంతం అయ్యేందుకు... టీటీడీపీ నేతలంతా కలసికట్టుగా, సమన్వయంతో వ్యవహరించాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News