: అండమాన్ లో అల్పపీడనం... ఏపీ, తెలంగాణ రాష్ట్రాలో భారీ వర్షాలు పడే అవకాశం


అండమాన్ సముద్ర తీరంలో సోమవారం అల్పపీడనం ఏర్పడిందని భారత్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇది రేపటిలోగా మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం గురువారంలోగా తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది కోస్తా తీరం వైపుగా వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News