: స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు
విశాఖపట్టణం నుంచి హైదరాబాదుకు వస్తున్న స్వర్ణజయంతి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో బాంబు పెట్టినట్టు దుండగులు ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది బాంబు నిర్వీర్యదళానికి సమాచారం అందించారు. కాజీపేట స్టేషన్ లో ట్రైన్ ను అత్యవసరంగా ఆపేసిన రైల్వే అధికారులు ప్రతి బోగీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు.