: కాంగ్రెస్ సీఎంను, సచిన్ ను ప్రశంసించిన మోడీ


ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రశంసించారు. తనదైన శైలిలో దూసుకుపోయే మోడీ, మంచి చేసిన వారిని అభినందించడంలో ముందుంటారు. తాను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్న అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ ని ప్రధాని ప్రశంసించారు. క్లీన్ ఇండియాలో పాల్గొని అసోం ప్రజలకు ముఖ్యమంత్రి ఆదర్శంగా నిలిచారని ట్వీట్ చేశారు. స్వయంగా ముంబై వీధుల్లో చీపురు పట్టి శుభ్రం చేసిన క్రికెట్ లెజెండ్ సచిన్ ను ప్రధాని ప్రశంసల్లో ముంచెత్తారు. క్రికెట్ దిగ్గజం చేసిన ఈ పని ఎందరికో స్ఫూర్తిమంతమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News