: మోడీ ప్రతిపాదనను స్వీకరిస్తున్నా: శశిథరూర్
'స్వచ్ఛ భారత్' ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రతిపాదనను తాను స్వీకరిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తెలిపారు. కేరళలోని తిరువనంతపురంలో ఆయన మాట్లాడుతూ, తాను బీజేపీకి మద్దతుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వీకరించడం లేదని, భారతదేశానికి మద్దతుగా స్వీకరిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని రాజకీయాలతో సంబంధం లేకుండా తన పేరును ప్రతిపాదించారని, తాను కూడా అంతే స్ఫూర్తిగా తీసుకుంటానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేతగా దీనికి గర్విస్తున్నానని ఆయన తెలిపారు.