: జయలలిత తెల్లచీర కడతారా?
కర్ణాటక జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు నిబంధనల ప్రకారం తెల్లచీర కడతారా? లేదా? అనే అనుమానం పరప్పన అగ్రహారం జైలు అధికారులను వేధిస్తోంది. నిబంధనల ప్రకారం ఆమెపై ఒత్తిడి తెస్తే పరిస్థితి ఎలా తయారవుతుందో తెలియక హడలిపోతున్నారు. జైలు బయట అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానుల ఆందోళనలు, నిరసనలతో ఉద్రిక్తత నెలకొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో... ఆమెపై నిబంధనల ప్రకారం దుస్తులు ధరించాలని ఒత్తిడి చేస్తున్నారంటూ వార్తలు వెలువడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు రావణకాష్టంలా రగులుతున్నాయి. దీంతో, కర్ణాటక అధికారులు పురచ్చితలైవిని తమిళనాడు జైలుకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.