: ఈద్ నాడు వాఘా వద్ద మిఠాయిల పంపిణీ లేదు!


భారత్-పాక్ సరిహద్దు వాఘా వద్ద బక్రీద్ రోజున సంప్రదాయంగా వస్తున్న మిఠాయిల పంపిణీ రద్దయింది. ఇరుదేశాల మధ్య ఏళ్ల తరబడి బక్రీద్ సందర్భంగా మిఠాయిలు పంచుకోవడం ఆనవాయతీ. అయితే, తాజాగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆ సంప్రదాయానికి పాక్ తిలోదకాలిచ్చింది. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణకు నిత్యం తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్ రేంజర్లు, తాజాగా ఈద్ మిఠాయిల పంపిణీకి మొగ్గుచూపకపోవడం గమనార్హం. దీనికి ఆ దేశ సైనికులు ఎలాంటి కారణం చెప్పలేదు. దీంతో, భారత సరిహద్దు భద్రతా దళం కూడా వాఘా సరిహద్దు గేట్లను మూసేసింది.

  • Loading...

More Telugu News