: మావోయిస్టు గణపతిని భద్రతా బలగాలు రౌండప్ చేశాయా?


సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు (65) అలియాస్ గణపతి... దేశంలో మోస్ట్ వాంటెడ్ నక్సల్ నేత. ఈయన తలపై రూ.3 కోట్ల రివార్డుంది. తాజాగా, గణపతిని ఛత్తీస్ గఢ్ లోని అభూజ్ మాడ్ అడవుల్లో భద్రత బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఆయన తప్పించుకునే వీల్లేకుండా, అన్ని మార్గాలను దిగ్బంధించినట్టు సమాచారం. క్యాడర్ తో సమావేశం నిర్వహించేందుకు గణపతి వస్తాడన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రత బలగాలను భారీ ఎత్తున రంగంలోకి దించారు. ఈ విషయమై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, మావోయిస్టు అగ్రనేతగా ఎదిగిన గణపతి తుపాకీ పట్టకముందు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలను ఆనుకుని ఉన్న అడవుల్లో సంచరిస్తున్న గణపతి కోసం డజనుకు పైగా బృందాలు (స్టేట్ పోలీస్-సీఆర్పీఎఫ్) కూంబింగ్ ఆపరేషన్లలో పాలుపంచుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News