: ఆడపిల్లను ఏడిపిస్తే కళ్లు పీకేస్తాం... వారిని చూడాలంటే లాగు తడవాల్సిందే: కేసీఆర్


ఆదివారం రాత్రి తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభా పక్షం, పొలిట్ బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, మహిళల రక్షణపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినకుండా మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 'ఒక నెల దాటాక చూడండి. ఆడపిల్లను చూడాలంటే ఉచ్ఛ పోసుకోవాలి. రాబోయే నెలరోజుల్లో అల్లరి, రౌడీ మూకల నియంత్రణపై దృష్టి పెడుతున్నాం. అమ్మాయిలను ఏడిపిస్తే కళ్లు పీకేసే కార్యక్రమం చేపడతాం. దీన్ని కూడా కాంట్రవర్సీ చేస్తారేమో... చేస్తే చేసుకోనీ... ఆడవాళ్లను చూడాలంటే లాగు తడవాల్సిందే. హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ లేకుంటే ఇజ్జత్‌ పోతుంది. మహిళల రక్షణ కోసం రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం రూపొందించాలని యోచిస్తున్నాం’ అని చెప్పారు.

  • Loading...

More Telugu News