: నా కంటే నా కుమార్తెలే తెలివైనవారు: మహేష్ భట్
తన కంటే తన కుమార్తెలే తెలివైనవారని బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రాక్టికల్‌గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సలహాలిస్తారని అన్నారు. మహేష్ భట్‌కు పూజా భట్ (నటి, నిర్మాత), షహీన్ (రచయిత్రి), అలియా భట్ (హీరోయిన్) ముగ్గురు కుమార్తెలు. తన కుమార్తెలు ఎవరి సాయం లేకుండా తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరారని ఆయన పుత్రికోత్సాహం వ్యక్తం చేశారు.