: పూటుగా తాగి భార్య గొంతు కోశాడు


విశాఖపట్టణం జిల్లా ఎండాడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మత్స్యకారులు అధికంగా నివసించే ఎండాడలో పూటుగా తాగేసిన ఓ వ్యక్తి, మద్యం మత్తులో తన భార్య గొంతు కోశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు విషయం గమనించి అతనికి దేహశుద్ధి చేశారు. కత్తిగాట్లతో గాయపడిన ఆమెను హుటా హుటీన ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతనికి బడితె పూజ చేసి పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News