: 'ఆన్ మిలటరీ డ్యూటీ' బోర్డుతో ట్రక్... లోపల 200 కోట్ల హెరాయిన్


మాదక ద్రవ్యాలకు పంజాబ్ కేంద్రంగా మారుతోంది. స్మగ్లర్లు తెలివిమీరిపోయి మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ నెల 15న హర్యానాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్ సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు, లూథియానా జిల్లాలోని ములాన్ పూర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 'ఆన్ మిలటరీ డ్యూటీ' అనే బోర్డు ఉన్న ట్రక్ లో అక్రమంగా తరలిస్తున్న 40 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 200 కోట్ల రూపాయలు ఉంటుందని నిపుణులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు అప్పగించారు. స్మగ్లర్లు పోలీసులు, భద్రత సిబ్బంది దృష్టి మళ్లించేందుకు 'ఆన్ మిలటరీ డ్యూటీ' అనే బోర్డు వాహనానికి తగిలించారని అధికారులు తెలిపారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News