: నాడు వీసానే ఇవ్వలేదు...నేడు పెట్టుబడులతో వస్తామంటున్నారు!


అమెరికా, భారత్ సంబంధాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇటీవల ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ అమెరికాలో జరిపిన ఐదు రోజుల పర్యటన దీనికి బాటలు పరిచింది. 2005లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీకి వీసా ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. 2002 నాటి గోద్రా అల్లర్లకు కారకులంటూ, ఆయనపై ముద్ర వేసిన అమెరికా, తన గడ్డపై మోడీ కాలుమోపేందుకు ససేమిరా అంది. అదే అమెరికా 2014లో మోడీ రాక కోసం నెలల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసింది. మోడీలో ఏదైనా మార్పు వచ్చిందా? ఏమీ లేదు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి దేశ ప్రధానిగా ఎదిగారు. గోద్రా అల్లర్ల కేసు ఇంకా నడుస్తూనే ఉంది. మోడీ వాగ్ధాటిలో ఏమాత్రం పస తగ్గలేదు సరికదా, మరింత ఎక్కువైంది. మరి మోడీకి వీసా ఎలా ఇచ్చిందంటారు? వీసా ఇచ్చిందే అనుకోండి, ఆ దేశ కార్పోరేట్ దిగ్గజాలు భారీ ఎత్తున పెట్టుబడులు పెడతామంటే, ప్రోత్సహిస్తోంది తప్పించి, వద్దనడం లేదెందుకని? అంతా మోడీ మేనియా, ఆయన సమ్మోహన శక్తి. న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ వద్ద మోడీ చేసిన ప్రసంగానికి అమెరికా మంత్రముగ్ధురాలైంది. దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ! రానున్న మూడేళ్లలో భారత్ లో 41 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆ దేశ కార్పోరేట్ దిగ్గజాలు ముందుకు వచ్చాయి. మరిన్ని పెట్టుబడులతో భారత్ వెళ్లండంటూ ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా కార్పోరేట్లను ప్రోత్సహిస్తున్నారట. కేవలం 10 ఏళ్లలో ఆ దేశ వైఖరిలో ఈ మేరకు మార్పు వచ్చింది!

  • Loading...

More Telugu News