: మెట్రోపోలీస్ సదస్సుకు ముస్తాబైన హైదరాబాద్


హైదరాబాద్ లో జరిగే మెట్రో పోలీస్ అంతర్జాతీయ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ తెలిపారు. అక్టోబర్ 6 నుంచి 10వరకు జరిగే ఈ సదస్సుకు 50 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ప్రపంచంలోని ముఖ్య నగరాలకు చెందిన మేయర్లంతా ఈ సదస్సులో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతుండడంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని ఆయన అన్నారు ఈ సదస్సులో భాగంగా అక్టోబర్ 7న జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ ఈ సదస్సుకు వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో ఉన్న సమస్యలు, నగరాభివృద్ధి, ఆర్థికవృద్ధి, ఉపాధి, సుపరిపాలన తదితర అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇవ్వడం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక వెబ్ సైట్ ను, మొబైల్ అప్లికేషన్లను కూడా ప్రారంభించింది.

  • Loading...

More Telugu News