: ఇంటర్ విద్యార్థిని, ఆమె తల్లిపై సామూహిక అత్యాచారం


దసరా వేడుకలకు వెళ్లి ఇంటికి వస్తున్న ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ కొందరు మృగాళ్లు, ఆమె తల్లిపైనా అఘాయిత్యానికి ఒడిగట్టారు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. రావణ దహనం వీక్షించేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని శుక్రవారం రాత్రి ఇంటికి తిరిగివస్తుండగా, ముఖాలకు మాస్కులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను అక్కడే వదిలేసిన దుండగులు ఆ బాలిక ఇంటికి వెళ్లారు. మీ కూతురు అక్కడ పడిపోయిందంటూ బాలిక తల్లికి చెప్పారు. దీంతో కంగారుగా ఆమె వారి వెంట వెళ్లింది. ఈ క్రమంలో ఆమెపైనా ఆ దుర్మార్గులు అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం పరారయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాకా సాగిన ఈ పర్వంపై బాధితురాలు శనివారం ఉదయం గ్రామ సర్పంచ్ కు ఫిర్యాదు చేసింది. సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News