: చంద్రబాబు కార్యాలయానికి రూ.20 కోట్లు ఖర్చట!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం కోసం రూ. 20 కోట్ల మేర ఖర్చైందట. కేవలం రెండు, మూడేళ్ల పాటు వినియోగించే కార్యాలయం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఎందుకన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో సి బ్లాకును తెలంగాణ సీఎంకు కేటాయించిన నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోక తప్పలేదు. తొలుత హెచ్ బ్లాక్ లో సీఎం కార్యాలయం ఏర్పాటు చేయాలని తలచినా, వాస్తు బాగాలేదన్న కారణంగా తాజాగా ఎల్ బ్లాకులో చంద్రబాబు కోసం ఎనిమిదో అంతస్తులో సకల హంగులతో సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కవచంతో రూపుదిద్దుకుందట. చంద్రబాబుకు ఫొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేయక తప్పలేదట. సీఎం కార్యాయలం ఉన్న ఎల్ బ్లాక్ ఎనిమిదో అంతస్తులో సీఎం ఛాంబర్, ఓ కాన్ఫరెన్స్ హాల్, కేబినెట్ సమావేశాల కోసం మరో హాలు, విజిటర్ల కోసం ప్రత్యేక లాంజ్, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల కోసం ఛాంబర్లు తదితర హంగులన్నీ ఉన్నాయట. వాస్తు బాగాలేదన్న కారణంగా భారీ ఖర్చు పెట్టి, సకల హంగులతో సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక చీఫ్ సెక్రటరీ కోసం ఎల్ బ్లాకులోనే ఏడో అంతస్తులో మరో కార్యాలయం కూడా సిద్ధమైంది.

  • Loading...

More Telugu News