: ప్రధాని మోడీతో అమెజాన్ బెజోస్ భేటీ


ప్రధాని నరేంద్ర మోడీతో ప్రపంచ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.కామ్ వ్యవస్థాపకుడు జెఫ్రీ బెజోస్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఓ అధికార ప్రకటన వెలువడింది. దీపావళి నేపథ్యంలో భారత్ లోని మార్కెట్ తీరుతెన్నులను పరిశీలించే నిమిత్తం బెజోస్ భారత్ వచ్చిన విషయం తెలిసిందే. భారత్ లోని వివిధ నగరాల్లోని విభిన్న రీతులను పరిశీలిస్తున్న ఆయన శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏఏ అంశాలు చర్చకొచ్చాయన్న అంశం వెల్లడి కానప్పటికీ, భారత్ లో అమెజాన్ ఏర్పాటు చేయబోయే క్లౌడ్ డేటా సెంటర్ ప్రస్తావన తప్పనిసరిగా వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాక, ఇప్పటికే భారత్ లో రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అమెజాన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. సదరు చెక్కును బెజోస్, అమెజాన్ వైస్ ప్రసెడెంట్, భారత కంట్రీ మేనేజర్ కు అందజేసిన సంగతీ విదితమే. అయితే భారత్ లో మరిన్ని పెట్టుబడులు, ప్రభుత్వ సహకారం తదితర అంశాలను ప్రధాని మోడీ, బెజోస్ కు వివరించి ఉంటారన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News