: నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
నలుగురు అఖిల భారత సర్వీసు (ఐఏఎస్) అధికార్లను ఏపీ ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ గా వీణా ఈష్ ను ప్రభుత్వం నియమించింది. పర్యాటక యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా శశాంక్ గోయల్ ను బదిలీ చేసింది. గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ ను నియమించింది. ఐఆర్ఎస్ అధికారి ఎం జగదీష్ బాబును ఏపీ ప్రణాళికా బోర్డు కార్యదర్శిగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.