: అమ్మ జైలు ముందు అభిమానుల ఆందోళన
దసరా పండగ నాడు తమ పార్టీ అధినేత జయలలిత జైలులో మగ్గిపోవడంపై అన్నా డీఎంకే కార్యకర్తలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీంతో బెంగళూరులో ఆమె ఉన్న పరప్పన ఆగ్రహారం జైలు వద్దకు వెళ్లారు. వారిని జైలు సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. జయలలితను కలిసేందుకు తమను అనుమతించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.