: ఆంధ్రప్రదేశ్ కు అతి త్వరలో ప్రత్యేక హోదా వస్తుంది: నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక పారిశ్రామిక హోదా ఇవ్వటంపై ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. దీని గురించి, కేంద్రంపై ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు రాలేదని ఆమె స్పష్టం చేశారు. గురువారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, అతి త్వరలోనే దీనిపై సానుకూలమైన నిర్ణయం వెలువడుతుందని ఆమె తెలిపారు.