: రైల్వే పరిసరాల్లో చెత్త వేస్తే చర్యలు తప్పవు: దక్షిణ మధ్య రైల్వే


రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఇకపై చెత్త వేస్తే చర్యలు తప్పవట. ప్రధాని మోడీ స్వచ్ఛ్ భారత్ అభియాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలను అపరిశుభ్రం చేసిన వారి నుంచి దాదాపు రూ. 40 లక్షల మేర జరిమానాను వసూలు చేశామని చెబుతున్న ఆయన, ఇకపై దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలో ఈ నిబంధనను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రైల్వే పరిసరాల్లో చెత్త వేస్తే చర్యలు తీసుకునేలా త్వరలో ఓ చట్టం రాబోతోందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News