: నేడు మోడీ తొలి రేడియో ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తొలిసారిగా రేడియోలో ప్రసంగించనున్నారు. ఇప్పటికీ టెలివిజన్ సౌకర్యానికి నోచుకోని దేశ ప్రజలనుద్దేశించి మోడీ తన ప్రసంగాన్ని వినిపించనున్నారు. ‘మన్ కీ బాత్’ పేరిట ఆల్ ఇండియా రేడియోలో ఈ ఉదయం 11 గంటలకు మోడీ ప్రసంగం ప్రసారం కానుంది. దీనిని ఆల్ ఇండియా రేడియోతో పాటు ఇతర రేడియో నెట్ వర్క్ లు, ఎఫ్ఎం స్టేషన్లు కూడా ప్రసారం చేయనున్నాయి. మోడీ ప్రసంగాన్ని ఆల్ ఇండియా రేడియో నేటి సాయంత్రం తర్వాత తన ప్రాంతీయ ఛానెళ్లలో పున:ప్రసారం చేయనుంది. ప్రధాని మోడీ ప్రసంగం తమకు భారీ ప్రోత్సాహాన్ని ఇచ్చేదేనని ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ షహర్యార్ తెలిపారు.