: ఐఫోన్ అభిమానులకు శుభవార్త!


యాపిల్ ఐఫోన్ అభిమానులకు శుభవార్త. అక్టోబర్ 8 కల్లా 'ఐఫోన్ 6'ను భారత విపణిలోకి ప్రవేశపెడుతున్నట్టు యాపిల్ సంస్థ తెలిపింది. ఈ-కామర్స్ ద్వారా అమ్మకాలు ప్రారంభించనున్నామని వెబ్ సైట్లు తెలిపాయి. 'ఐఫోన్ 6' ధర సుమారు 56 వేల రూపాయలు ఉండవచ్చని సమాచారం. అయితే, భారత్ లో 'ఐఫోన్ 6' అమ్మకాలపై యాపిల్ కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ఈ-కామర్స్ లో ఈబే సంస్థ 'ఐఫోన్ 6' ధరను 55,954 రూపాయలుగా నిర్ణయించింది. ఐఫోన్ అమ్మకాలు అక్టోబర్ 8 తేది నుంచి ప్రారంభించే అవకాశం ఉందని ఈబే తెలిపింది. అదే తేదీన అమ్ముతామంటూ షాప్ క్లూ.కామ్ 16 జీబీ కెపాసిటి 'ఐఫోన్ 6' ధరను 59,999 వేల రూపాయలుగా పేర్కొంది. దానికి షిప్పింగ్ చార్జీ 148 రూపాయలు అదనమని తెలిపింది. సెప్టెంబర్ 9 తేదీన అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశించిన 'ఐఫోన్ 6' సిరీస్ భారత్ లో అక్టోబర్ చివరిలో కానీ, నవంబర్ మొదటి వారంలో కానీ అందుబాటులోకి వస్తుందని యాపిల్ సంస్థ పేర్కొంది. కాగా, 'ఐఫోన్ 6' అమ్మకాలు జరిపేందుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఇతర ఈ-కామర్స్ దిగ్గజాలు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News