: ప్రధాని సవాలు విసిరారు... అభిమానులు చేద్దామా?: ప్రియాంక చోప్రా


ప్రధాని నరేంద్ర మోడీ విసిరిన సవాలుకు తొలి స్పందన లభించింది. 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంకా చోప్రా, శశిథరూర్, సచిన్ టెండుల్కర్, తారక్ మెహతా, అనిల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ లను తనలా చేసి చూపించి, మరో తొమ్మిది మందిని భాగస్వాములను చేయాలని సవాలు విసిరారు. ప్రధాని సవాలుకు ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక ట్విట్టర్లో సమాధానం చెప్పారు. ప్రధాని చేపట్టిన కార్యక్రమానికి తాను మద్దతు పలుకుతున్నానని చెప్పారు. ప్రధాని ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఇది చాలా మంచి ఆలోచన అని, దేశాన్ని బాగుచేసుకునేందుకు సరైన పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రధాని చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆమె తన అభిమానులకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News