: దారి చూపిస్తానని నమ్మించి అత్యాచారం చేశాడు
స్నేహితురాలింటికి దారి చూపిస్తానని నమ్మించి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. మహారాష్ట్రలోని పూనేకి ఓ 18 ఏళ్ల విద్యార్థిని బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్ వద్ద నివసిస్తున్న తన స్నేహితురాలిని కలుసుకునేందుకు వచ్చింది. స్నేహితురాలు చెప్పిన అడ్రస్ ప్రకారం మాల్దాక్కా చౌక్ ప్రాంతానికి చేరుకున్నాక దారి మర్చిపోయింది. దీంతో అక్కడే ఉన్న నావల్ జోసఫ్ (32) అనే వ్యక్తిని సాయం కోరింది. అడ్రస్ తనకు తెలుసని, స్నేహితురాలిని చేరేందుకు దారి చూపిస్తానని నమ్మబలికి ఆమెను ఖడ్కీ ప్రాంతంలోని ఓ నిర్జనప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఎవరికైనా చెబితే పరువు తీస్తానంటూ సెల్ ఫోన్ లో అభ్యంతరకరమైన రీతిలో ఫోటోలు తీశాడు. ఆ కామాంధుడి బారినుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు.