: ముంబై ఎమ్మెల్యేల ప్రాధాన్యతా రంగం మరుగుదొడ్లేనట!


దేశ వాణిజ్య రాజధాని ముంబైకి చెందిన ఎమ్మెల్యేలు, వివిధ పథకాల కింద అందిన నిధుల్లో మెజార్టీ వాటాను మరుగుదొడ్ల నిర్మాణానికే వినియోగిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర మురికివాడల్లో నివసించే జనాభా 41 శాతానికి తగ్గినా, ఆ మేర మరుగుదొడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టినట్టో ఏలిన వారికే ఎరుక. నగరంలో ప్రస్తుతం మొత్తం 36 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎంఎన్ఎస్ ఎమ్మెల్యే బాల నందగావోంకర్, టాయిలెట్ల ఏర్పాటు కోసం 114 శాతం నిధులను వెచ్చిస్తే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మొన్నటి దాకా మంత్రిగా కొనసాగిన నసీం ఖాన్ 76 శాతం నిధులను మరుగుదొడ్లకు కేటాయించారు. మరుగుదొడ్లకు అతి తక్కువ ఖర్చు చేసిన వారిలో ఖాన్ దే అగ్రస్థానం. అంటే, మిగిలిన వారంతా తమ నిధుల్లో 76 శాతం కంటే అధికంగానే టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించేశారు. 2009 నుంచి ఎమ్మెల్యే నిధుల కింద ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి రూ.1 కోటి కేటాయిస్తే, 2014లో ఈ మొత్తాన్ని రూ.2 కోట్లకు పెంచారు. దీనికి తోడు, ఇంకా ప్రత్యేక నిధులు కూడా తెచ్చుకుని ఈ కార్యక్రమాలు చేబట్టినట్టు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News