: ఇంద్రకీలాద్రిపై పోలీసులతో లగడపాటి రాజగోపాల్ వాగ్వాదం
విజయవాడలో ఈ ఉదయం లగడపాటి రాజగోపాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దసరా సందర్భంగా కనకదుర్గమ్మను సందర్శించుకోవడానికి లగడపాటి తన అనుచరగణంతో ఇందకీలాద్రికి ఈ ఉదయం వెళ్లారు. అయితే, ఆయన వాహనాన్ని కొండపైకి పోలీసులు అనుమతించలేదు. దీంతో, పోలీసులు... దేవస్థానం అధికారులపై లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో చాలా సేపు వాగ్వాదానికి దిగారు. పాసులు ఉన్న వాహనాలనే పైకి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేయడంతో, ఆఖరికి లగడపాటి అమ్మ వారిని దర్శించుకోవడానికి నడుచుకుంటూ కొండపైకి వెళ్లారు.