: ‘ఆసియా’ కబడ్డీలో ఫైనల్స్ కు భారత్ పురుష, మహిళల జట్లు


ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల మెరుగైన ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా గురువారం కబడ్డీ విభాగంలో భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా ఫైనల్స్ చేరింది. దీంతో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరడం ఖాయమైంది. ఫైనల్స్ లో రెండు జట్లు విజయం సాధిస్తే, రెండు బంగారు పతకాలు భారత్ ఖాతాలో చేరతాయి. పరాజయం పాలైనా రెండు వెండి పతకాలు ఖాయమే. ప్రస్తుతం పతకాల పట్టికలో 11వ స్థానంలో ఉన్న భారత్ ఖాతాలో ఏడు బంగారు పతకాలతో పాటు 9 వెండి, 34 కాంస్య పతకాలున్నాయి.

  • Loading...

More Telugu News