: ప్రధాని మోడీపై అమెజాన్ బాస్ ప్రశంసల జల్లు!


ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.కామ్ అధినేత జెఫ్ బెజోస్, భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో మోడీ, అందరికంటే ముందున్నారని పేర్కొన్న బెజోస్, మోడీతో భేటీపై అమితాసక్తితో ఉన్నానన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న బెజోస్, ఇక్కడి మార్కెట్ తీరుతెన్నులు, పండగ వాతావరణానికి మంత్రముగ్ధులయ్యారు. ఇటీవల భారత్ ప్రయోగించిన మార్స్ మిషన్ పై పొగడ్తలు గుప్పించిన ఆయన అవకాశం ఉంటే, భారత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, భారత్ లో అమెజాన్ క్లౌడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు బెజోస్ సూత్రప్రాయ ప్రకటన జారీ చేశారు. ఇటీవలే మైక్రోసాఫ్ట్, తన డేటా సెంటర్ ను భారత్ లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెజాన్ కూడా తన డేటా సెంటర్ ఏర్పాటు ప్రకటనతో భారత మార్కెట్ ను మరింతమేర ఒడిసిపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

  • Loading...

More Telugu News