: 1990 రూపాయలకు అల్కాటెల్ స్మార్ట్ ఫోన్
మొబైల్ సంస్థల మధ్య పోటీ వినియోగదారులకు వరంగా మారుతోంది. అల్కాటెల్ చౌకైన స్మార్ట్ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. కేవలం 1,990 రూపాయలకే వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని అల్కాటెల్ రీజనల్ డెరైక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఫైర్ ఫాక్స్‌తో కలసి ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రత్యేకంగా రూపొందించామని ఆయన తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరుపుతామని, ఈ నెల 6 నుంచి వినియోగదారులకు ఇవి అందుబాటులో వుంటాయని ఆయన తెలిపారు.