: జయ లేఖల పరంపరను సెల్వం కొనసాగిస్తున్నారు!
శ్రీలంక నేవీ అదుపులో ఉన్న తమిళనాడు జాలర్ల విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి జయలలిత ముఖ్యమంత్రి హోదాలో ఎన్నో లేఖలు రాశారు. ఇప్పుడామె జైలుపాలయ్యారు. ఆమె స్థానంలో పన్నీర్ సెల్వం సీఎం పదవిని అందుకున్నారు. జయ పరంపరను కొనసాగిస్తూ, సెల్వం తాజాగా ప్రధానికి ఓ లేఖ రాశారు. శ్రీలంక భద్రత బలగాలు అరెస్టు చేసిన 20 మంది భారత జాలర్ల విడుదలకు మార్గం సుగమం చేయాలని ఆయన తన లేఖలో కోరారు. జాలర్లకు చెందిన 75 బోట్లను కూడా శ్రీలంక అధికారులు స్వాధీనం చేసుకున్నారని సెల్వం వివరించారు.