: గోరఖ్ పూర్ రైలు ప్రమాదంలో 12 కు చేరిన మృతుల సంఖ్య
ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ సమీపంలో మంగళవారం రాత్రి రెండు పాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. మంగళవారం రాత్రి 10.45 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇప్పటిదాకా 12 మంది ప్రయాణికులు మరణించారు. మరో 45 మంది దాకా గాయపడ్డారు. పట్టాలు మారుతున్న క్రమంలో రెండు రైళ్లు ఢీకొన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో రెండు భోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంతో గోరఖ్-వారణాసిల మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఘటనలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు మరణించారని రైల్వే అధికారులు ప్రకటించినా, గాయపడ్డ వారు ఆస్పత్రిలో చనిపోవడంతో మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.