: నేడు జయలలిత బెయిల్ పిటిషన్ పై విచారణ


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. కర్ణాటక హైకోర్టులోని వెకేషన్ బెంచ్ ఈ విచారణను చేపట్టనుంది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలిత సెప్టెంబర్ 27 నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న జయలలిత పిటిషన్ ను మంగళవారం పరిశీలించిన వెకేషన్ బెంచ్, ఈ నెల 6న విచారించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో నేడు విచారణ జరగనుంది. జయలలిత తరఫున కోర్టులో వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ హాజరవుతున్నారు. మరోవైపు అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసుగా దీనిని పరిగణించి, తక్షణమే విచారణ చేపట్టాలని రామ్ జెఠ్మలానీ కోర్టును కోరారు. తనకు కేవలం 5 నిమిషాల సమయం ఇస్తే, జయలలితను నిర్దోషిగా ప్రకటించేలా చేస్తానంటూ ఆయన మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News