: మోడీ ఏ డ్రెస్సు వేసుకొచ్చారని చూస్తున్నారు!
అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ వేసుకుంటున్న దుస్తులను పరిశీలించారా..? హుందాతనాన్ని చక్కగా చాటుతున్నాయవి! నెహ్రూ జాకెట్లు, బంద్ గలా సూట్లు, హాఫ్ స్లీవ్ కుర్తాలు... ఇలా, సందర్భానికి తగినట్టు ఆయన వస్త్రధారణ ఉంటోంది. అగ్రరాజ్యంలో ఆయన ప్రసంగాలే కాదు, ఏ దుస్తులు వేసుకుకొచ్చారన్నది కూడా మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. టాప్ టు బాటం పర్ఫెక్ట్ మ్యాచింగ్ కు ప్రతీకలా నిలుస్తున్నారని అటు మీడియా, ఇటు ఫ్యాషన్ డిజైనర్లు కితాబిస్తున్నారు. మోడీ ఓ సమావేశానికి గానీ, సదస్సుకు గానీ హాజరైతే... అందరి కళ్ళూ ఆయన వేసుకొచ్చిన దుస్తులపైనే ఉంటున్నాయట. మోడీ కొత్త లుక్కు వెనుక ఓ ముంబయికి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ శ్రమ ఉంది. అతని పేరు ట్రాయ్ కోస్టా. మోడీ అమెరికా పర్యటనకు కావాల్సిన దుస్తులన్నీ కోస్టా డిజైన్ చేసినవే. సహజంగానే మోడీది ఆకట్టుకునే రూపం. దానికితోడు నప్పే దుస్తులు ధరించడంతో ఆయన మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారని ఫ్యాషన్ డిజైనర్ కృష్ణా మెహతా అన్నారు.