: అర్హుల జాబితాలో లేనివారు మమ్మల్ని సంప్రదించండి: కోదండరాం


అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఆర్థికసాయం అందించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 469 మంది అర్హుల జాబితాను తయారు చేశారు. ఈ మేరకు తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, ఆర్థిక సాయం జాబితాలో లేని అర్హులెవరైనా ఉంటే జేఏసీని సంప్రదించవచ్చని చెప్పారు. అర్హులైన కొన్ని కుటుంబాల పేర్లు జాబితాలో లేవన్నారు. మొత్తం ఆరువందలకు పైగా అమరవీరుల కుటుంబాలు ఉన్నాయని, తమ వద్ద ఉన్న ఆ సమాచారాన్ని త్వరలో హోంమంత్రికి అందిస్తామని కోదండరాం తెలిపారు.

  • Loading...

More Telugu News