: ఐదు కోట్లకు చేరిన 'జన్ ధన్ యోజన' ఖాతాలు
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'జన్ ధన్ యోజన' పథకం దేశంలో ప్రజలను బాగా ఆకర్షించింది. ఈ నెల 25 కల్లా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదు కోట్ల ఖాతాలు తెరిచినట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి సంధూ తెలిపారు. వాటి ద్వారా రూ.3,500 కోట్ల డిపాజిట్లు వచ్చినట్లు చెప్పారు. ఈ పథకం కింద సగటున ప్రతి ఖాతాలో రూ.800 నుంచి 900 డిపాజిట్ అయినట్లు వివరించారు. ఈ ఖాతాలన్నింటికీ ఆధార్ నంబర్ జత చేయబడిందని, ఇందులో నకిలీని గుర్తించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తాన్నామనీ అన్నారు.