: జయలలితకు తమిళ చలనచిత్ర పరిశ్రమ సంఘీభావం!


అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడ్డ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఆ రాష్ట్ర చిత్ర పరిశ్రమ సంఘీభావం ప్రకటించింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది. చెపాక్ ప్రభుత్వ అతిథి గృహం ముందు చిత్ర సీమ ప్రముఖులు మౌనదీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ నటుల సంఘం పాల్పంచుకోనున్నాయి. అంతేకాక చెన్నైలోని సినిమా థియేటర్లన్నీ కూడా నేటి సాయంత్రందాకా మూతపడనున్నాయి. తమిళ చిత్ర సీమ మౌనదీక్ష నేపథ్యంలో చెన్నై పరిసరాల్లో మంగళవారం మొత్తం షూటింగ్ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి.

  • Loading...

More Telugu News