: ఆసియా క్రీడల్లో భారత్ కు ఐదో స్వర్ణం
ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. మహిళల డిస్కస్ త్రోలో సిమా పునియా పసిడి పతకం దక్కించుకుంది. దాంతో, భారత్ ఖాతాలో ఐదు స్వర్ణాలు చేరాయి. అటు పురుషుల టెన్సిస్ డబుల్స్ ఫైనల్ లో సనంసింగ్, సాకేత్ మైనేని జంట కొరియా చేతిలో ఓడిపోవడంతో రజత పతకం వచ్చింది. 61 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో భారత క్రీడాకారుడు భజరంగ్ రజత పతకం సాధించాడు. 74 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో నర్సింగ్ యాదవ్ కాంస్యపతకం గెలుపొందాడు. మహిళల 1500 మీటర్ల పరుగులో జైషా కాంస్యం సాధించింది.