: ఢిల్లీ మెట్రోకు ద్వితీయ స్థానం
వినియోగదారుల సంతృప్తిని తెలుసుకునేందుకు నిర్వహించిన ఆన్ లైన్ కస్టమర్స్ సర్వేలో ఢిల్లీ మెట్రోకు రెండవ స్థానం లభించింది. మొత్తం 18 అంతర్జాతీయ మెట్రో వ్యవస్థల్లో భారత్ కు చెందిన మెట్రోకు ఈ స్థానం లభించడం విశేషం. దాంతో పాటు లండన్ డీఎల్ఆర్, బ్యాంకాక్ మెట్రో వ్యవస్థలు ప్రయాణికులకు ఉత్తమ సేవలను అందిస్తున్నట్టు 'నెట్ ప్రమోటర్స్ స్కోర్' (ఎన్ పీఎస్) లో తేలినట్లు ఢిల్లీ మెట్రో రైల్వే అధికారులు తెలిపారు. ఈ సర్వేను గ్లోబల్ మెట్రో బెంచ్ మార్కింగ్ గ్రూప్స్ 'నోవా', 'కోమెట్' (కమ్యూనిటీ ఆఫ్ మెట్రోస్) గ్రూపులు నిర్వహించాయి.