: ఐదేళ్లకే డాక్టరేట్ పట్టా సాధించిన తెలుగు బాల మేధావి


ఆ తెలుగు బుడతడికి ఐదేళ్లు కూడా నిండలేదు. అప్పుడే డాక్టరేట్ సాధించాడు. 30 ఏళ్లకు కాని అష్టకష్టాలు పడితే కాని చేతికందని డాక్టరేట్, తెలుగు దంపతులు కల్యాణ్, వీణల ఐదేళ్ల చిన్నారికి ఎలా దక్కిందంటే, ఆలోగానే అతడు బాల మేధావిగా అవతరించాడు మరి. అసాధారణ తెలివితేటలతో మూడుసార్లు గిన్నిస్ రికార్డు కైవసం చేసుకున్న ఆ బాల మేధావికి ఢిల్లీలోని వరల్డ్ రికార్డు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. నేడు ఢిల్లీలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, అతడికి సదరు డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నారు. రెండేళ్ల వయసులో 2 నిమిషాల 19 సెకన్లలోనే 215 జాతీయ పతాకాలను గుర్తుపట్టిన ధీరజ్, మూడున్నరేళ్ల వయసులో 83 మంది శాస్త్రవేత్తల పేర్లను వారి ఆవిష్కరణలు సహా ఒకే ఒక్క నిమిషంలో చెప్పేశాడు. వరల్డ్ మ్యాప్ పజిల్ ను 3 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేసిన ధీరజ్ నిజంగా గౌరవ డాక్టరేట్ కు అర్హుడే. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ధీరజ్, యూకేజీ చదువుతున్నాడు.

  • Loading...

More Telugu News