: తిరుమలలో పేకాట ఆడిన వారిపై విచారణ జరపండి: ఆదేశించిన చంద్రబాబు


తిరుమలలో జరుగుతున్న అపవిత్ర కార్యకలాపాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే వారినెవరినీ ఉపేక్షించరాదంటూ టీటీడీ ఈవో గోపాల్ ను ఆదేశించారు. ఈ రోజు తిరుమలలో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఓ పురోహితుడి వద్ద గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. మరో దాడిలో మహారాష్ట్రకు చెందిన కొందరు యువకులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. పేకాట ఆడిన వారిపై తక్షణమే విచారణ జరపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News