: విరిగిపడ్డ భారీ వృక్షం... ఇద్దరు మృతి
150 ఏళ్లనాటి మహా వృక్షం కొమ్మలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని తాతపూడి గ్రామంలో సంభవించింది. క్షతగాత్రులను మండపేట, రాజమండ్రి ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలాన్ని రామచంద్రాపురం ఆర్డీవో, అంగర ఎస్సై సందర్శించారు.